మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలో 2018 సంవత్సరంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయికి కోర్టు 20 ఏళ్ల జైలు, రూ. 10వేల జరిమానా విధించినట్లు రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ కేసులో ఓ ముద్దాయి పరారీలో ఉండగా ఆత్మకూరుకు చెందిన 2వ ముద్దాయి శ్రీనివాస్ (20)కి గుంటూరు జిల్లా 5వ కోర్టు జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారని పేర్కొన్నారు.