చలికాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి ఇందిరానగర్ యూపీ హెచ్ సీ సమెడికల్ ఆఫీసర్ అనూష శుక్రవారం సూచించారు. చలి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. చలికాలంలో రక్తనాళాలు, ధమనులు సంకోచించి బీపీ పెరిగి గుండెపోటుకు గురి అయ్యే ప్రమాదాలు ఉన్నాయన్నారు. కూరగాయలు, పండ్లు తీసుకుంటూ పాల ఉత్పత్తులు, మాంసం, తక్కువగా తీసుకోవాలన్నారు.