చట్టాల్లో స్త్రీ, పురుషులు సమానమని ఉన్నప్పటికీ భారతదేశంలో మహిళని ద్వితీయ శ్రేణిగా చూస్తున్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రొఫెసర్ డాక్టర్ రత్న షీలామని అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్, డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల సంయుక్తంగా శనివారం ఏఎన్యూ లో లీగల్ ఎయిడ్ సదస్సు నిర్వహించారు.