మంగళగిరి: రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దు: ఎస్సై

58చూసినవారు
మంగళగిరి: రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దు: ఎస్సై
చిరు వ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయకూడదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. సోమవారం మంగళగిరిలోని ఎన్నారై వైజంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు ఎస్ఐ కౌన్సెలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వ్యాపారులు రోడ్ల పక్కన నిర్దేశించిన మార్జిన్ లో మాత్రమే వ్యాపారం చేసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫార్మ్ ధరించి ఆటోలను నడపాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్