మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణానికి చెందిన తాడిబోయిన భాస్కరరావుకు నామినేటెడ్ పదవి దక్కింది. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఆయనను నియమించారు. ఈ సందర్భంగా బుధవారం భాస్కరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో యాదవుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.