ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో చర్చ పెట్టాలని సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ నేత ఎల్. జైబాబు డిమాండ్ చేశారు. మంగళగిరి ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో శనివారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలతో సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు అధ్యక్షతన జరిగింది.