నెల్లూరుకు చెందిన 15 మంది కార్పోరేటర్లు, కో-ఆప్షన్ సభ్యుడు, నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, పలువురు వైసీపీ నేతలు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. గురువారం మంగళగిరి మండలం ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, తదితరులు ఉన్నారు.