మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహణ

57చూసినవారు
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహణ
మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్యాలయ సెక్రెటరీ ఆదివారం పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు పలువురు మంత్రులు, నాయకులు ప్రజావేదికలో పాల్గొంటారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఆయా శాఖల మంత్రులు అర్జీలను స్వీకరించనున్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజా వేదిక కానుందని తెలిపారు. ప్రజా వేదికకు సంబంధించిన షెడ్యూల్ ను సెక్రెటరీ విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్