వాగులో చిక్కుకున్న టాటా ఏసీ

68చూసినవారు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులో వంకలు, పొంగిపొర్లుతున్నాయి. అమరావతి-సత్తెనపల్లి కాలచక్ర రహదారిలో వాగు శనివారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అటుగా వెళ్లిన టాటా ఏసీ వాహనం వాగులో చిక్కుకుంది. స్థానికులు అప్రమత్తమై తాడులతో కట్టి నిలిపివేశారు. పెను ప్రమాదం తప్పిందని వారు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్