ఎస్సీ వర్గీకరణపై మాల మహానాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం నరసరావుపేటలో బస్టాండ్ వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులను డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. మాల, మాదిగ రెండు కులాలు కలిసి ఉంటే రాజ్యాధికారాన్ని పంచుకోవచ్చని వారు చూస్తున్నారని దుయ్యబట్టారు.