జన్మదిన వేడుకల్లో మంగళవారం రాత్రి ప్రారంభమైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి సోడాబుడ్లతో దాడికి దారితీసింది. ఈ ఘర్షణలో సాయి మహేశ్ అనే యువకునికి గాయాలయ్యాయి. పట్టణంలోని పెద్ద చెరువుకు చెందిన ఒక వర్గం వారు ప్రకాశ్ నగర్ 60 అడుగుల రోడ్డులోని క్షతగాత్రుని ఇంటిపైకి రావడంతో దాడి ప్రారంభమైంది. సోడాబుడ్లు విసురుకోవడంతో రోడ్డు మొత్తం గాజు పెంకులు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోలీసులు అదుపు చేశారు.