సోడాబుడ్లతో దాడి చేసుకున్న నరసరావుపేట పట్టణంలోని ప్రకాశ్ నగర్ 60 అడుగుల రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక పోలీస్ పికెట్ పెట్టారు. పాత వివాదమే మంగళవారం రాత్రి జరిగిన దాడులకు కారణమని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. బాధితులతో పాటు కూల్ డ్రింక్స్ షాపుపై సోడాబుడ్లు, రాళ్లు విసరడంతో ఫ్రిడ్జ్ సైతం ధ్వంసమైంది. కాగా 2 టౌన్, రూరల్ సీఐలు హైమారావు, రామకృష్ణలు పరిస్థితిని సమీక్షించారు.