సంక్రాంతి పండుగ సందర్భంగా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 37వ జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు గురువారం హోరాహోరీగా జరుగుతున్నాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో ఆరవ రోజు జూనియర్స్ విభాగంలో పోటీ జరుగుతుంది. 20 క్వింటాళ్ళ బండను 20 నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగిన జతను విజేతగా ప్రకటిస్తారు. మొదటి బహుమతి రూ. 75, 116, 2వ బహుమతి రూ.55, 116, 3వ బహుమతి రూ. 45, 116 ఇస్తున్నట్లు నిర్వాహకులు సుబ్బారావు తెలిపారు.