పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో రైతులకు సాగునీరు తదితర అంశాల గురించి ప్రస్తావించారు. రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సాంబశివరావు పేర్కొన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలియచేశారు.