
అరండల్ పేటలో ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణం
అరండల్ పేటలో బుధవారం ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తూ విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో డాక్టర్ రవికుమార్ అనితా జ్యోతి స్వగృహంలో 21సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, హోమం జరిపారు. పూర్ణాహుతి కార్యక్రమంలో హనుమాన్ ఉపాసకులు తిరుపతి గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానందస్వామి పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. గుంటూరు పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.