ప్రధాని నరేంద్రమోడీ శ్రీరామనవమి సందర్భంగా తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త 'పంబన్ బ్రిడ్జ్'ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది.