Mar 30, 2024, 05:03 IST/వేములవాడ
వేములవాడ
కొనసాగుతున్న స్వామివారి కళ్యాణ మహోత్సవాలు
Mar 30, 2024, 05:03 IST
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శివ కళ్యాణ మహోత్సవాలు శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కామ దహనం తర్వాత శివ కళ్యాణం ఐదు రోజులపాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. నాల్గవ రోజు అర్చక స్వాములు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. స్వామివార్లను రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు.