AP: మంత్రివర్గం సమావేశం అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్న భూమనపై కేసులు నమోదు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటివే జరుగుతాయని, టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి బాధ్యత మాట్లాడాలని సూచించారు. టీటీడీపై బురద జల్లి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే సహించమన్నారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో కూడా మతకలహాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.