AP: విశాఖపట్నం మధురవాడలో అనూష అనే నిండు గర్భిణీ భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. మంగళవారం అనూషకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనూష గర్భంలో ఆడ బిడ్డ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి, బిడ్డను చూసి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఘోరంగా విలపిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.