AP: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగలనుంది. త్వరలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో హోంమంత్రి అనిత గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని, ఈ క్రమంలోనే భూమనపై త్వరలో కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో వైసీపీలో చర్చలు మొదలయ్యాయి. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనలో కూడా భూమన హస్తం ఉందని ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.