పోక్సో కేసు నేపథ్యంలో తాజాగా బాంబే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక(15)ను ఓ యువకుడు (22) అత్యాచారం చేశాడన్న కేసులో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక UPకి చెందిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో తిరిగి వచ్చింది. ఆమె తండ్రి యువకుడిపై పోక్సో కేసు పెట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు 'బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు' అని పేర్కొంటూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.