పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులచే శుక్రవారం గ్రామంలో డిస్లెక్సియా అవేర్నెస్ మంత్ లో భాగంగా డిస్లెక్సియాపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ వ్యాధి గల విద్యార్థులలో వైకల్యాలను అధిగమించి అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరిచడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. దీనిలో హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పున్నారావు, సుబ్బారావు, ఐఇడి టీచర్ అబ్దుల్ రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.