అమరావతి మండల పరిధిలోని ధరణికోట జైలు సింగ్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. ప్రోక్లెన్ సాయంతో సోమవారం ఉదయం గండి కొట్టి నీరు వీధుల్లో లేకుండా వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికారులు పల్లపు ప్రాంతంలో ఉన్న నీరు కాలువల ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రోక్లైన్ ద్వారా గండి పగలగొట్టి నీరు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు.