అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. అనంతరం వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభిమానులు వరద బాధితుల కోసం అన్నదాన కార్యక్రమం చేయడం అభినందనీయమని వారిని కొనియాడారు.