పెదకూరపాడులోని కమ్యూనిటీ ఆసుపత్రిలో ఎనస్తీషియా, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్ డాక్టర్లను వెంటనే నియమించాలని పెదకూరపాడు అభివృద్ధి వేదిక కన్వీనర్ దర్శి శేషారావు సోమవారం జరిగిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే ప్రవీణ్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ, పెదకూరపాడులోని ఆసుపత్రిలో నెలల తరబడి డాక్టర్లు లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ముస్తాన్ రావు, జానీ బాషా, ఆర్ ముత్తయ్య, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.