క్రోసూరు నుంచి దొడ్లేరు వరకు డబల్ రోడ్డు నిమిత్తం సైడ్ బెర్మలు ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా ఏర్పాటు చేసిన అమరావతి బెల్లంకొండ డబల్ రోడ్డు పనులు క్రోసూరు మండలం నుంచి శరవేగంగా కొనసాగుతున్నాయని వాహనదారులు ఆదివారం తెలిపారు. సైడ్లు కంకర రాళ్లు వేసి రోలింగ్ తో చదును చేస్తూ రోడ్డును వెడల్పు చేస్తున్నారని వారు తెలిపారు.