దొడ్లేరు క్రైస్తవ స్మశాన వాటిక పక్కన క్రోసూరు గ్రామంలోని చెత్తాచెదారం రోడ్డుకు ఇరువైపులా వేయడంతో దుర్వాసనతో భరించలేకపోతున్నామని బుధవారం స్థానికులు తెలిపారు. చెత్త సేకరించిన పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డుకు చెత్త తరలిస్తే సమస్య ఉండదన్నారు. రోడ్డుపై చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని దుర్వాసన నుంచి గ్రామ ప్రజలు బయటపడతామని తెలిపారు.