ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికలకు డిగ్రీ పాసైన వారందరూ ఓటర్ గా నమోదు కావాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. శనివారం అమరావతిలో ఓటర్ల నమోదు పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2021 అక్టోబర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగిన వారందరూ ఓటరుగా చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.