ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధిలో కుంటుపడిన కన్నెగండ్ల గ్రామ ప్రగతికి పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ప్రత్యేక చొరవ చూపారని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమళ్ళ రమేష్ అన్నారు. శనివారం ఆ గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. పల్లె పండుగ లో భాగంగా రూ 10 లక్షలతో గ్రామంలో సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను కన్నెగండ్ల గ్రామ సర్పంచ్ కోరంపల్లి వెంకటరామయ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.