గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలోని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా బాబా దర్గాను బుధవారం నేషనల్ మైనారిటీ కమీషన్ మెంబర్ సయ్యద్ షహజాదీ సందర్శించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి మహబూబ్ షరీఫ్, వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్, దర్గా ఎగ్జిక్యూటివ్ అధికారి ముక్తియార్ భాషా షహజాదీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్గాలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులు ఆమెను కోరారు.