గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తాళ్లపాలెం గ్రామంలోని శ్రీ విజయ గణపయ్య, శ్రీ అభయాంజనేయ స్వామివార్ల 4వ వార్షిక మహోత్సవ కార్యక్రమం శుక్రవారం జరుగుతుంది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగునని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ మాసం లో స్వామివార్ల ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగునని తెలిపారు. తాళ్లపాలెం శ్రీ విజయ గణపయ్య , శ్రీ అభయాంజనేయ స్వామి వారి మహోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. అనంతరం అన్నసంతర్పణ జరుగునని ఈ అన్నసంతర్పణ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.