పెదనందిపాడు మండలంలో శనివారం పాఠశాల ఆవరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల శ్రద్ధ వహించాలనీ 400 మంది విద్యార్థులు ఉండగా 100 మంది తల్లిదండ్రులు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.