గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పశ్చిమబెంగాల్లో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈలాంటి సంఘటనలు మరో సారి జరగకుండా చూడాలి అని అలానే ఈలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలి అని వారి డిమాండ్ చేశారు.