బాపట్లలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పోటీల్లో కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఎడ్ల జతకు మొదటి బహుమతి లభించింది. 100 కేజీల విభాగంలో ఎడ్ల జత 3719 మీటర్ల బండి లాగి మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో నిలిచిన ఎడ్ల జతకు నిర్వాహకులు 20 వేల రూపాయల నగదు బహుమతిని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా యజమాని శ్రీనివాసరావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.