గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన గన్నవరపు వెంకటేశ్వర్లు అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు కి ఆరు లక్షలు అప్పులు ఉండటంతో మనస్థాపానికి గురై ఇంట్లో బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తండ్రి సుబ్బారావు కాకుమాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.