ప్రతిపాడు: కత్తెర పురుగు నివారణకు రైతులకు అవగాహన కార్యక్రమం

71చూసినవారు
ప్రతిపాడు: కత్తెర పురుగు నివారణకు రైతులకు అవగాహన కార్యక్రమం
కాకుమాను మండలం చిన్నలింగాయపాలెం, కెబి పాలెం గ్రామాలలో శుక్రవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది. మండల ఏవో కిరణ్మయి పాల్గొని మాట్లాడుతూ మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు అరికట్టే యాజమాన్య పద్ధతులను వివరించారు. కత్తెర పురుగు నివారణకు ఎకరాకు 150 ఎం.ఎల్. ఇమామెక్టిన్ బెంజోయేట్ (ప్రోక్లైన్), 150 ఎం.ఎల్. నవల్యూరాన్ (రైమాన్) లేదా 120 ఎం.ఎల్. ప్రోక్లైన్, డెల్టా మెథ్రిన్ కాంబినేషన్ తో కలిపి స్ప్రే చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్