ప్రతిపాడు: అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బూర్ల

65చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంకాయలపాడు మేజర్, మల్లాయపాలెం మేజర్ కాలువల మరమ్మత్తుల పనులను శుక్రవారం ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాలువల మరమ్మత్తుల పనులు ఏ మేరకు జరిగాయి, చేయవలసిన పనులు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ నాటికి కాలువల మరమ్మత్తులు నూరు శాతం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.

సంబంధిత పోస్ట్