గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో వేంచేసియున్నశ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన హుండీ లెక్కింపు సోమవారం దేవస్థానం ఆవరణంలో జరిగింది. మూడున్నర నెలలకు రూ. 5, 18, 468 లక్షల ఆదాయం వచ్చిందని బాపట్ల ఇన్స్పెక్టర్ గోపి , దేవస్థానం ఈవో బత్తుల సురేష్ బాబు తెలిపారు. గ్రామ సర్పంచి యర్రాకుల దానయ్య, దేవస్థానం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.