గంజాయి కేసులో నిందితుడు అరెస్ట్

50చూసినవారు
గత నెలలో నమోదైన గంజాయి కేసులో ప్రధాన నిందితుడైన కలగాని భాను ప్రకాష్ ను అరెస్టు చేసినట్లు రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ క్రైమ్ నెంబర్ 148/2024 కేసులో ఆరుగురు ముద్దాయిలను గతంలో అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. ఈ కేసులో భాను ప్రకాష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.

సంబంధిత పోస్ట్