రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ను తయారు చేయించి కారులో దర్జాగా తిరుగుతున్న ఇద్దరు యువకులను రేపల్లె పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ గుంటూరుకు చెందిన అభినయ్ అనే వ్యక్తి తన కారుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్టిక్కర్ వేసుకుని తిరుగుతుండగా గుర్తించిన మంత్రి వ్యక్తిగత సహాయకుడు ధర్మ తేజ ఫిర్యాదు చేశాడన్నారు.