చెరుకుపల్లి మండలంలో పాఠశాలలు ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

63చూసినవారు
చెరుకుపల్లి మండలంలోని పాఠశాలలను బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆయా పాఠశాలల్లోని కిచెన్ షెడ్లను, టాయిలెట్స్ ను పరిశీలించారు. కలెక్టర్ వెంకట మురళి టీచర్ గా మారి విద్యార్థులను పాఠాలకు సంబంధించిన అంశాలు ప్రశ్నించారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్