చెరుకుపల్లిలో భారీ వర్షం

60చూసినవారు
చెరుకుపల్లిలో మంగళవారం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీచాయి. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్లో రహదారి గోతులమయంగా మారింది. ఈ రహదారిలో గూడ్స్ వెహికల్స్, కంటైనర్స్ తిరుగుతూ ఉండటంతో గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్