పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు రేపల్లె మండలం పేటేరు గ్రామానికి చెందిన సురేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.