ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణం 28వ వార్డుకు చెందిన హేమ నాగశ్రీ అనారోగ్యంతో బాధపడుతుండగా మంత్రి సత్యప్రసాద్ చొరవతో వైద్య ఖర్చులు కొరకు అవసరమగు రూ.6లక్షల ఎల్ఓసి(సిఎంఆర్ఎఫ్) లెటర్ ను బుధవారం హేమశ్రీకి మంత్రి సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అందచేశారు.