ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం
రొంపిచర్ల మండలంలోని కొనకంచివారిపాలెంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఇందులో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.