రొంపిచర్లలో నిలిచిపోయిన రాకపోకలు
రొంపిచర్ల మండలంలోని విప్పర్లపల్లి, వడ్లవారిపాలెం రహదారి మార్గమధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో రహదారి పక్కన ఉన్న చెట్లు విరిగి రహదారి మీద అడ్డంగా పడ్డాయి. విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.