సత్తెనపల్లిలో సినీ నటుడు పోసాని వెంకట కృష్ణమురళిపై టీడీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, లోకేశ్ పై వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మారాకా కూడా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు.