రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా సోమవారం సత్తెనపల్లి రూరల్ మండలం కట్టావారిపాలెం గ్రామం, కంటెపూడి గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత, మళ్ళీ మన పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు.