తుళ్లూరు మండల పరిధిలోని లైబ్రరీ సెంటర్ లో శనివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. త్రిబుల్ డ్రైవింగ్ చేసే వారిపై, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్, ఆల్కహాల్ టెస్ట్ లను వాహనదారులకు చేశారు. కేవలం ప్రమాదాలు వివరించేందుకు మాత్రమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.