తుళ్ళూరు పోలీసులు సోమవారం రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆయనను విచారించారు. పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయనను మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
అనంతరం తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.